రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి - జైపాల్ రెడ్డి మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన  కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి -  జైపాల్ రెడ్డి మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

మునగాల , ముద్ర :-కాబోయే ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పులో ముంచి తన అవినీతినికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రగల్బాల్ పలుకుతున్న కేటీఆర్ రైతులకు ఇంతవరకు రుణమాఫీ చేయలేదని రైతు నష్టపోయిన పంటకు నష్టపరిహారం లేకుండా చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాసర్ల కోటేశ్వరరావు మండల ఉపాధ్యక్షుడు సామెల్ మండల ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు భీమప్పంగు శంకర్ కాసర్ల వెంకన్న గోపి శ్రీను తదితరులు పాల్గొన్నారు.