తెలంగాణకు ఏం ఒరగబెట్టారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు

తెలంగాణకు ఏం ఒరగబెట్టారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు

రాష్ట్ర సర్కార్ పై ద్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి  కృష్ణారావు
 కోరుట్ల ముద్ర న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో టిఆర్ఎస్ కార్యకర్తలకు మద్యం మాంసాహార భోజనాలతో  విందు వినోదాలు ఏర్పాటు చేయడం అత్యంత బాధాకర విషయం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ  మాజీ చైర్మన్ జువ్వాడి   కృష్ణారావు అన్నారు ఈరోజు కోరుట్ల పట్టణంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం కోసం ఎందరో యువకులు ఆత్మ బలిదానాలు చేశారని అలాంటి త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంబి ఆ  రెఎస్  రాబందుల చేతిలో చిక్కుకుందని రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పేదవాళ్లు రెండు పుటల భోంచేసే పరిస్థితి లేదని కానీ ప్రభుత్వ ఖర్చుతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మద్యం మాంసాహారo తో విందు వినోదాలు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు ఇచ్చిన మాట కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేశారని కానీ కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని చె రపట్టి రాక్షస పాలన చేస్తున్నారని అన్నా.

రు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నుండి నేటి వరకు తెలంగాణకు  ఏం చేశారని తెలంగాణ ఏర్పడితే ఇంటికిఓక ఉద్యోగం ఇస్తామని చెప్పి కనీసం ఊరుకో ఉద్యోగమైనఇవ్వనందు కా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వంలో ఉన్నాయని నేటికీ వాటిని భర్తీ చేయనందుక నిరుద్యోగులకు 3116 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీని నేటి వరకు అమలు చేయనందుకా పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి నేటి వరకు నిర్మించినందుక వరి ధాన్యం పండించిన రైతులను  నట్టేట ముంచుతూ రైస్ మిల్లర్లకు లాభం చేకూర్చే విధంగా తూకల్లో కోతలు విధిస్తున్నందుక నేటి వరకు వడ్లు కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు చెల్లించనందుక రాష్ట్రంలో ఏ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించినందుక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నందుకా  తెలంగాణ ఉద్యమంలో అసువులు  బాసిన వారి కుటుంబాలకు అన్యాయం చేసినందుక ఎందుకు దశాబ్ది ఉత్సవాలను  నిర్వహిస్తున్నారని కృష్ణారావు అన్నారు. 

అలాగే కోరుట్ల నియోజకవర్గ విషయానికొస్తే స్థానిక శాసనసభ్యుడు శాసనసభ్యులుగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఏ హామీ అమలు చేశాడో బహిరంగంగా చెప్పాలని డిమాండ్  చేశారు.  కోరుట్ల మెట్పల్లి ప్రాంతంలో ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కళాశాల అనుమతించగా ఇక్కడ స్థాపించిన ఇంజనీరింగ్ కళాశాలను స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్ కు తరలించి వ్యాపారం చేసుకుంటున్నాడని ప్రభుత్వం సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాల ఆయన వ్యాపారానికి ఉపయోగపడినందుక దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునేది అని అన్నారు ఇప్పటికైనా   సామాన్య తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకోవాలని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని అప్పుడు ఉత్సవాలు నిర్వహించాలని జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షుడు ఎం.ఏ నయిం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.