ఉదయలక్ష్మి మృతి బాధాకరం: కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి

ఉదయలక్ష్మి మృతి బాధాకరం: కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి

కోదాడ టౌన్ ముద్ర: తెలంగాణ ఉద్యమకారుడు, భారత రాష్ట్ర సమితి నాయకులు రాయపూడి వెంకటనారాయణ తల్లి రాయపూడి ఉదయలక్ష్మి మృతి భాదకరం అని  భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి , భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శిఎర్నేని వెంకటరత్నం బాబు లు  అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో  నిర్వహించిన  ఉదయలక్ష్మి దినదశ కర్మలో వారు పాల్గొని మాట్లాడారు.

రాయపూడి కుటుంబ సభ్యులు ఉదయ లక్ష్మీ పేరు తో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆమే పేరు కలకాలం నిలపాలన్నారు. ఆమే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమం లో డిసిసిబి మాజీ అధ్యక్షులు ముత్తవరపు పాండురంగారావు,  అనంతగిరి జడ్పిటిసి కొనతం ఉమా శ్రీనివాస్ రెడ్డి , చిలుకూరు జడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు , కోదాడ లారీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పైడిమర్రి వెంకట నారాయణ , తెలంగాణ ఉద్యమకారుడు రాయపూడి చిన్ని , భారత రాష్ట్ర సమితి నాయకులు డాక్టర్ దశరథ , దండ వీరభద్రం , మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్ , నరేందర్ రెడ్డి , లక్ష్మణ్  తదితరులు పాల్గొన్నారు.