కొండగట్టులో ఘనంగా జ్యేష్టాభిషేకo

కొండగట్టులో ఘనంగా జ్యేష్టాభిషేకo

ముద్ర, మల్యాల: ప్రసిద్ధి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం జ్యేష్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ వేదపండితులు, అర్చకులు ఆలయంలో 108 కళాశాలలు ఏర్పాటు చేసి, గణపతి పూజ, అష్టోత్తర కళశాభిషేకం, విశ్వక్షేణారాధన, పుణ్యహ వచనం, వరుణావహన, మహా నివేదన తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పౌండర్ ట్రష్టి చైర్మన్ టి. మారుతి, ఈవో టంకశాల వెంకటేష్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరిoడేoట్ సునీల్ కుమార్, ప్రధాన అర్చకులు రఘు, ఉప ప్రధాన అర్చకులు మారుతిప్రసాద్, పాలక వర్గం సభ్యులు జున్ను సురేందర్, కొంక నర్షయ్య, పోచమల్ల ప్రవీణ్, లింగాగౌడ్, సతీష్, గంగాధర్, అర్చకులు లక్ష్మణ్ స్వామి, తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన భక్తుల రద్దీ... కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రాక కొనసాగింది. వేసవి సెలవులు ముగిసి, పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్బంగా భక్తులు కుటుంబ సమేతంగా అంజన్నను దర్శించుకుంటున్నారు.