కోటేశ్వరస్వామిని దర్శించుకున్న శాతవాహన యూనివర్సిటీ వీ సి

కోటేశ్వరస్వామిని దర్శించుకున్న శాతవాహన యూనివర్సిటీ వీ సి

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని కోటిలింగాలలో గల కోటేశ్వరస్వామిని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ ఆచార్య సంకటాల మల్లేష్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులను అడిగి  ఆలయ ప్రత్యేకతలు, చరిత్రను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని వెల్గటూర్ హర్ష శ్రీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో హర్ష శ్రీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఎర్రంశెట్టి మహేందర్, అధ్యాపకులు సంకోజు నరేష్,  నక్క రవి తేజ, పెద్దురి భరత్ కుమార్,  గాలిపల్లి మహేష్ పాల్గొన్నారు