ముత్యంపేటలో పారిశుధ్య పనుల పరిశీలన..

ముత్యంపేటలో పారిశుధ్య పనుల పరిశీలన..

సర్పంచ్ ను అభినందించిన అడిషనల్ కలెక్టర్
ముద్ర, మల్యాల: మంగళవారం మండలంలోని ముత్యంపేట గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ మంద మకరంద పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఇటీవల నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని సందర్శించిన ఆయన, గ్రామంలో గ్రంధాలయం నిర్మాణం కోసం పాత జీపి కార్యాలయాన్ని పరిశీలించారు. ముత్యంపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డిని అడిషనల్ కలెక్టర్ అభినందించారు. వీరి వెంట డీపీవో నరేష్, ఎంపీవో వాసవి, కార్యదర్శి స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

 కొండగట్టులో...
చిన్న జయంతి ఉత్సవాల సందర్బంగా మంగళవారం అడిషనల్ కలెక్టర్ మకరంద కొండగట్టు లో ఏర్పాట్లు పరిశీలించారు. రద్దీ కొనసాగుతున్నందున భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, తదితరులు ఉన్నారు.