పూర్వ విద్యార్థులు బీరువా బహుకరణ

పూర్వ విద్యార్థులు బీరువా బహుకరణ

మునగాల, ముద్ర: మునగాల ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అభివృద్ధిలో భాగంగా 
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తొమ్మిది వేల రూపాయల విలువ గల ఇనుప బీరువాను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు బహుకరణగా అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వల్లోజు వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహింపజేసిన మునగాల ఉన్నత పాఠశాల కు తమ వంతుగా  బీరువాను బహూకరించినట్లు తెలిపారు. భవిష్యత్తులో  పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఆర్థిక పారితోషకం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు వల్లోజు వెంకట కృష్ణ ,శేషిరెడ్డి రామిరెడ్డి,శ్రీనివాస్ , సైదా, ప్రతాప్ ,సైదులు తదితరులు పాల్గొన్నారు.