ఆటల వల్ల యువతలో సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి

ఆటల వల్ల యువతలో సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి
  • యువతీ యువకులే రాబోయే కాలంలో మూలస్తంభాలు
  • ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న

ముద్ర నేరేడుచర్ల:ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చందు జయంతిని పురస్కరించుకొని ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలోనీ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బాల బాలికలకు క్రీడ దుస్తులను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓజో ఫౌండేషన్ ద్వారా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ క్రీడాకారులను ప్రోత్సహించిన వ్యక్తి పిల్లుట్ల రఘు అని అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాలీబాల్, క్రికెట్ కిట్లతో పాటు అనేకమంది స్కూలు పిల్లలకు క్రీడ దుస్తులను తమ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేశామన్నారు. రఘు చేస్తున్న సేవలు హుజూర్ నగర్ నియోజకవర్గం లో నిర్విరామంగా సాగుతున్నాయని, కులాలకు, మతాలకు అతీతంగా చేస్తున్న సేవలను చూసి, మానవతా భావాలున్న నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.ప్రజలును ఆర్థికంగా ఆదుకోవడంలో, విద్య వైద్యంలో ఓజో పౌండేషన్ తరపున రఘు చేస్తున్న సేవలను ప్రజలు సుస్థిరం చేసుకున్నారని, రాబోయే కాలంలో రఘును ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకొని హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని, ధీమా వ్యక్తం చేశాడు.

ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మధు,ఫౌండేషన్ ప్రతినిధులు షేక్. నాగుల్ మీరా, షేక్ జాన్ సైదా, నాగరాజు యాదవ్, తమ్మిశెట్టి రాజేష్, వానపట్ల నాగరాజు, బొమ్మకంటి సైదులు, మహేష్,ఓజో ఫౌండేషన్ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.