నీరు లేక సాగు కాక..

నీరు లేక సాగు కాక..
  • నీరు లేక ఎండిపోతున్న పొలాలు..
  • బిడు భూములుగా మారుతున్న పొలాలు..
  • బోరు, బావిలో ఉన్న నీరు కూడా సరిపోవడం లేదు..
  • ఆందోళనలో రైతన్నలు..

ముద్ర, అనంతగిరి: వానాకాలం సీజన్ ప్రారంభమై సుమారుగా రెండు నెలలు దాటుతుంది. సాగర్ ఎడమ కాలువ నీరు విడుదల కాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.. దీంతో సాగునీరు లేక వీరుడు భూములుగా మిగిలిపోయాయి. గత నెలలో వర్షాలు కురిసి సాగర్ నిడమ కాలుకు ఉన్న ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరడంతో రైతాంగం ఆశలు చిగురించాయి. కానీ ప్రస్తుతం వర్షాలు జాడ లేకపోవడంతో సాగర్ ప్రాజెక్టు నీరు రాకపోవడంతో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ సీజన్ అవుతుందా లేదా అని రైతాంగం తీవ్ర నిరాశ లోనవుతున్నారు..

నీరు లేక బీడుగా మారిన పొలాలు..

శ్రీను (యువ రైతు) సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి.  అవసరమైతే శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగర్ ప్రాజెక్టు నీటి తరలించి సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..