థియేటర్లకు ప్రేక్షకులకు రప్పించే సినిమాలు రావాలి... -బాలకృష్ణ

థియేటర్లకు ప్రేక్షకులకు రప్పించే సినిమాలు రావాలి... -బాలకృష్ణ


రామ్‌ పోతినేని, బోయపాటి శ్రీనివాస్‌ కాంబోలో వస్తున్న చిత్రం 'స్కంద'. రామ్ కెరీర్​లో తెరకెక్కుతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో శ్రీలీల హీరోయిన్​గా నటించింది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ థండర్​ ఈవెంట్​ఆగస్టు 26న శిల్ప కళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్​కు చీఫ్ గెస్ట్​గా బాలకృష్ణ హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్య మాట్లాడుతూ.. "ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్కంద అనే టైటిల్​కు నా శిరస్సు వచ్చి భక్తి భావం తెలియజేస్తున్నాను. నేను.. బోయపాటి కలిసి 'సింహా', 'లెజెండ్‌', 'అఖండ' లాంటి సక్సెస్​ఫుల్​ మూవీస్​ చేశాం. ఇప్పుడు రామ్‌ -బోయపాటి కలయికలో వస్తున్న 'స్కంద' పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. కొత్త నేపథ్యాల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుగు సినిమాలు మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా పట్టం కడుతున్నారు. మా నాన్నగారు కూడా చలన చిత్ర అభివృద్ధి కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు" అని అన్నారు."ఈ రోజుల్లో సినిమా అంటే ఎలా ఉండాలి, ఆడియెన్స్​ను ఎలా థియేటర్లకు రప్పించాలి అన్న విషయంపై దర్శక నిర్మాతలు బాగా ఫోకస్ పెట్టాలి. రామ్‌ తెలంగాణ నేపథ్యంలో ఇస్మార్ట్‌ శంకర్‌ చేసి నాకొక ఛాలెంజ్​ విసిరాడు. ఇప్పుడు నేను అదే నేపథ్యంలో 'భగవంత్‌ కేసరి' చేశాను. ఆయన మళ్లీ డబుల్ ఇస్మార్ట్​ చేస్తున్నాడు. నేను డిగ్రి చదివితే.. ఆయన పీహెచ్ డీ చేశాడు. నేనింకా పాస్‌ అవ్వాల్సి ఉంది. ఇక్కడ నేను ఒక తిక్కకు లెక్కలేని రామ్ పోతినేని... 2006లో దేవదాసు ఓపెనింగ్​కు వచ్చాను. ఇప్పుడు స్కంధ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు వచ్చాను. అప్పటి నుంచి రామ్‌ ప్రయాణాన్ని చూస్తున్నాను.  అఖండ చెప్పింది. బాక్సులు బద్దలైపోయాయి. రికార్డ్​లు బద్దలైపోయాయి. ఇక శ్రీలీల.. అచ్చమైన తెలుగు హీరోయిన్. అందం..అభినయం..నాట్యం.. అన్ని కలగలిసిన మంచి నటి. ప్రతి సీన్ లో డెడికెషన్, తపన ఆమెలో ఉంది. ఇన్ని సినిమాలు చేస్తున్న ఆమెలో ఎనర్జీ తగ్గద్దు. తన డెడికెషన్​కు హ్యాండ్సాఫ్​. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు కనులవిందు చేస్తుందని నమ్ముతున్నా" అని బాలయ్య పేర్కొన్నారు.