ఆసియా కప్ తొలిసారిగా పోటీలో నేపాల్

 ఆసియా కప్ తొలిసారిగా పోటీలో నేపాల్
  • మెరుగైన ఆటతీరుతో పాక్
  • రెండోస్థానంలో భారత్​ 

ముంబై: ఆసియాకప్​లో మెరుగైన ఆటతీరుతో పాకిస్థాన్​48 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, భారత్​46.69శాతంతో రెండోస్థానంలో ఉంది. ఈ కప్​లో గతంలో జరిగిన మ్యాచ్​లో  మెరుగైన ప్రదర్శనను పాక్​ప్రదర్శించింది. క్రికెట్​ చరిత్రలో వన్డే, టీ–20, చాంపియన్స్​ట్రోఫీ, ఆసియాకప్, ప్రపంచ టెస్ట్​చాంపియన్​అనే ప్రధానమైన ఐదు టైటిల్స్​ను నిర్వహిస్తుంటారు. ఇందులో భారత్​ 12, శ్రీలంక9, పాకిస్థాన్​5 మేజర్​టైటిల్స్​ను గెలుచుకున్నాయి. ఆసియా ఖండంలో అంతర్జాతీయ, టీ–20 క్రికెట్​లకు అభిమానులెక్కువ. క్రికెట్​అభిమానులు ప్రపంచంలోనే భారత్​లో ఎక్కువగా ఉన్నారు. అత్యధిక టైటిళ్లను గెలుచుకోవడంలో భారత్, పాక్​లు పోటీ పడుతున్నాయి. ఐసీసీ, ఏసీసీ విజయాలలో ఈ రెండు జట్లు ముందంజలో ఉన్నాయి. గ్రాఫిక్​ ప్రకారం చూస్తే పాక్​ముందు, తరువాత భారత్​స్థానం కొనసాగిస్తోంది. భారత జట్టు 91 సంవత్సరాలుగా క్రికెట్​ను కొనసాగిస్తోంది. మొదటి వన్డేను 25 జూన్​ 1932న ఇంగ్లాండ్​తో ఆడింది. ఇక ఆసియా జట్లలో భారత్ తర్వాత అత్యధిక ట్రోఫీలను గెలుచుకున్నది శ్రీలంక. జట్టు తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ను 7 జూన్ 1975న ఆడింది.  భారత్​, పాక్​, శ్రీలంకలు పెద్ద టోర్నీలు గెలవడంలో ముందువరుసలో ఉన్నాయి. బంగ్లా, ఆఫ్ఘనిస్థాన్​ల ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. కాగా ఈసారి ఆసియా కప్​లో నేపాల్​తొలిసారి ఆడనుండడం విశేషం. 

ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుంది. క్రికెట్ ప్రపంచ కప్ ముగిసిన 17 రోజుల తర్వాత భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఈ రెండు టోర్నీలు వన్డే ఫార్మాట్‌లో ఉంటాయి. అంటే తర్వాతి రెండున్నర నెలలు 50–-50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు. అయితే వన్డే ఫార్మాట్‌పై ఉన్న ఆందోళన మరోలా ఉంది. గత 4 సంవత్సరాలలో, వన్డే ఇంటర్నేషనల్​ఫార్మాట్ బహుశా టీ–20గా మారిపోనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 50–50 ఓవర్ల మ్యాచ్​లపై క్రమేణా క్రికెట్​ అభిమానులకు ఆసక్తి తగ్గుతోంది. 20 –20 ఆటతీరు వైపే అభిమానులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్​నెస్​మ్యాచ్​నిర్వహణ, సమయాభావం తదితర అంశాలన్నింటినీ బేరీజు వేసుకున్నా వన్డేకంటే 20–20 బెటర్​ అనే వాదన అభిమానుల నుంచి వినిపిస్తోంది.