ఐపీఎల్‌-16 సీజన్‌కు బుమ్రా దూరం

ఐపీఎల్‌-16 సీజన్‌కు బుమ్రా దూరం

వెన్ను గాయం కారణంగా గత కొన్ని నెలలుగా జట్టుకు దూరమైన టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌-16 సీజన్‌లో ఆడతాడని ప్రచారం జరిగింది. అయితే, ఈ సారి బుమ్రా లేకుండానే ముంబయి ఇండియన్స్‌ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. బుమ్రా ఇంకా గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదు.   గాయం ముందుగా అంచనా వేసిన దానికంటే తీవ్రమైనదని, అతడు కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఐపీఎల్-16 సీజన్‌కు బుమ్రా అందుబాటులో ఉండేది అనుమానంగానే కనిపిస్తోంది. ఇక, జూన్‌లో లండన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌కల్లా కూడా బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించే అవకాశాలు కనిపించడం లేదు.