ఆప్​పై గంబీర్​ విమర్శలు

ఆప్​పై గంబీర్​ విమర్శలు

ఢిల్లీ: ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. స్కూల్స్, కార్యాలయాలను మూసేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఆప్‌పై విపక్ష పార్టీలే కాకుండా ప్రముఖ క్రికెటర్​ గౌతమ్​ గంబీర్​ కూడా ఆప్​సీఎం కేజ్రీవాల్​పై విమర్శలు గుప్పించారు. ఈ నేఫథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితులపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ అయిన గౌతమ్ గంభీర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఢిల్లీ ప్రజలారా మెలుకోండి. ఢిల్లీ మురుగు కాల్వలను తలపిస్తోంది.. ప్రజలకు ఏదీ ఉచితంగా రాదు, మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ ట్వీట్ చేశారు. ఉచిత విద్యుత్, ఉచిత రవాణా లాంటి పథకాలు అందిస్తున్న ఆప్ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. మరోవైపు ప్రస్తుతం ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు రావడానికి అధికార ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమంటూ బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు యమునా నదిలో అంచనాలకు మించి ప్రవాహం ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఆప్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.