ఆస్ట్రేలియా విజయానికి 312 లక్ష్యం

ఆస్ట్రేలియా విజయానికి 312 లక్ష్యం
  • సెంచరీతో చెలరేగిన డీ కాక్​
  • హాఫ్​సెంచరీ సాధించిన మార్కమ్​

లక్నో: సౌతాఫ్రికా–ఆస్ట్రేలియా మధ్య లక్నోలో గురువారం కొనసాగిన 10వ వరల్డ్​ కప్​ వన్డే మ్యాచ్​ లో  సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్​ను ఎంచుకోవడంతో సౌతాఫ్రికా బ్యాటింగ్​కు దిగింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన క్వింటన్​ డీ కాక్​ 106 బంతుల్లో 8 ఫోర్లు, ఐదు సిక్స్​లతో 109 పరుగులు సాధించాడు. బావుమా (కెప్టెన్​) 35 పరుగులు, దుస్సేన్​ (26) పరుగులు సాధించగా, ఏడేన్​ మార్కమ్​ 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్​తో 56 పరుగులు సాధించాడు. హెన్రీచ్​ క్లాసెన్​ 29 పరుగులు, డేవిడ్​ మిల్లర్​ 17, మార్కో జాన్​సెన్​ 26 పరుగులు, రబాడా 0, మహరాజ్​ 0 పరుగుల వద్ద ఇన్నింగ్స్​ ముగించారు. ఇన్నింగ్స్​లో 13 ఎక్స్​ట్రాలు నమోదయ్యాయి. 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 311 పరుగులు సాధించి ఆస్ట్రేలియాకు 312 పరుగుల విజయ లక్ష్యాన్ని సౌతాఫ్రికా నిర్దేశించింది. ఇక బౌలింగ్​ విషయానికి వస్తే మిచ్చెల్​ స్టార్క్​ 2, గ్లెన్​ మాక్స్​వెల్​ 2, జోష్​ 1, పాట్​ కమ్మిన్స్​ 1, ఆడమ్​ జంపా 1 వికెట్లు సాధించారు.