OG movie updates: పవన్ సినిమా 'OG' రిలీజ్ డేట్ ఇదే!

OG movie updates: పవన్ సినిమా 'OG' రిలీజ్ డేట్ ఇదే!
  • పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న 'OG'
  • ఆయన జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్
  • కీలకమైన పాత్రలో ఇమ్రాన్ హష్మీ 
  • సెప్టెంబర్ 27వ తేదీన సినిమా విడుదల  

పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్టు పట్ల పవన్ అభిమానులంతా చాలా ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమా విశేషాలను తెలుసుకోవడానికి వాళ్లంతా కుతూహలాన్ని కనబరుస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. 

'బ్రో' తరువాత పవన్ నుంచి ఇంతవరకూ మరో సినిమా రాకపోవడంతో, అభిమానులంతా 'OG' సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఒక వైపున ముంబై .. మరో వైపున జపాన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 

పవన్ సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ అలరించనుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో ఇమ్రాన్ హష్మీ .. అర్జున్ దాస్ .. శ్రియా రెడ్డి కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న 'హరి హర వీరమల్లు' ముగింపు దశలో ఉండగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' చేయనున్నాడు. 'OG'లో తన పోర్షన్ షూటింగు పూర్తయిన తరువాత, పవన్ ఈ ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.