Pawan About Jamuna Death శ్రీమతి జమునగారి ఆత్మకు శాంతి చేకూరాలి- పవన్‌కళ్యాణ్‌

Pawan About Jamuna Death శ్రీమతి జమునగారి ఆత్మకు శాంతి చేకూరాలి- పవన్‌కళ్యాణ్‌
May the soul of Smt. Jamuna rest in peace - Pawan Kalyan twitt

ప్రముఖ నటి లోక్‌సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమునగారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండితెర పై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమునగారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు.

ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవిగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమునగారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.