'బ్రో' లో కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం:  ఎస్.ఎస్. థమన్

'బ్రో' లో కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం:  ఎస్.ఎస్. థమన్

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల 'మై డియర్ మార్కండేయ' పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన థమన్ బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎవరెస్ట్ ని అధిరోహించడం లాంటిది. నాకు పవన్ కళ్యాణ్ గారితో మూడు సినిమాలూ రీమేక్ లే వచ్చాయి. వకీల్ సాబ్ గానీ, భీమ్లా నాయక్ గానీ, బ్రో గానీ సంగీతం పరంగా నేను చేయాల్సింది చేస్తున్నాను. సాంగ్స్ సినిమాకి హెల్ప్ చేస్తాయి. వకీల్ సాబ్ లో మగువ మగువ వంటి పాటని కూడా మాసీగా ఫైట్ కి ఉపయోగించాం. బ్రో అనే సినిమా విడుదలయ్యాక ఎంతోమందిని కదిలిస్తుంది. హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. త్రివిక్రమ్ గారి రచన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే సహజంగానే సినిమా స్థాయి పెరుగుతుంది. ఆ పాటను మాస్ గా చేయలేము. సామెతలు లాగానే చెప్పాలి. ప్రత్యేక గీతాలు లాంటివి స్వరపరచలేము. ఇది అలాంటి సినిమా కాదు. కొన్ని పరిధులు ఉన్నాయి. కాలం ఎంత ముఖ్యం అనే దానిపై ఒక ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నాం. త్వరలో తేజ్ డ్యూయట్ సాంగ్ ఒకటి రానుంది. అలాగే శ్లోకాలను అన్నింటినీ కలిపి ఒక పాటలా విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా క్లైమాక్స్ లో ఒక మాంటేజ్ సాంగ్ కి సన్నాహాలు చేస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంగీతం అంటే చాలా ఇష్టం. 'గుడుంబా శంకర్' సమయంలోనే మణిశర్మ గారి అసిస్టెంట్ గా ఆయనను చాలా దగ్గర నుంచి చూశాను. ఆయనకు సంగీతం విషయంలో చాలా నాలెడ్జ్ ఉంది.