అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్

అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్

ముద్ర, వేములవాడ:-ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ ను సీజ్ చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా మైనింగ్ ఏ.డి సైదులు తెలిపాడు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం  సోమవారం ఉదయం వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం సమీపంలోని గుట్ట ప్రాంతం నుండి జి.జె 06 జడ్.జడ్ 7332 అనే నెంబర్ కలిగిన టిప్పర్ లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని,  వెంటనే  తమ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని మట్టిని తరలిస్తున్న టిప్పర్ ను సీజ్ చేసి సమీపంలోని ఆర్టీసీ డిపోకు తరలించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా మట్టిని తరలించడం చట్ట విరుద్ధమని, అక్రమంగా తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని,  బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.