అన్నదాతలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

అన్నదాతలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే

ముద్ర బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లె నుండి కొదురుపాక రైతు వేదిక వద్దకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతు దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.మరియు కొదురుపాక, బోయినిపల్లి కొరేం, విలాసాగర్ రైతు వేదికలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటు చూసినా కాళేశ్వరం నీళ్ళు,ఎర్రటి ఎండాకాలంలో మత్తడి దుంకుతున్న చెరువులు, ఎటు చూసినా పచ్చని పంట పొలాలు,బంగారం లాంటి పంటలు, 24 గంటల కరెంటు, వ్యవసాయానికి ఉచితంగా 24గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా,రైతు వేదికల నిర్మాణం. రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు 65వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిన ప్రపంచంలోనే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి కేవలం మూడు సంవత్సరాలలో పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందించడం జరుగుతోంది.రైతు చనిపోతే రైతు బీమా పథకం ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వమే రైతులకు బీమా ప్రీమియం చెల్లిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసితో ఒప్పందం చేసుకొని సంవత్సరానికి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు రైతుల తరపున బీమా ప్రీమియం కడుతుందని తెలిపారు. రైతుబీమా పథకం ద్వారా రైతు చనిపోయిన కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసి చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి, ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, రైతులు, ఇతర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.