దొరల పాలననుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి

దొరల పాలననుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి
  • అణగారిన వర్గాలకు అధికారం వస్తేనే న్యాయం జరుగుతుంది.
  • సుద్దాల కాన్షీరామ్ విగ్రహావిష్కరణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ముద్ర కోనరావుపేట :దొరల పాలననుంచి తెలంగాణకు విముక్తి కలిగించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధికారం వచ్చినప్పుడే మన అభివృద్ధి జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోనరావుపేట మండలం సుద్దాలలో ఏర్పాటు చేసిన కాన్షీరామ్ విగ్రహాన్ని శనివారం రాత్రి ఆవిష్కరించి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మాయావతి 12 లక్షల ఉద్యోగాలు ఇవ్వగా తెలంగాణలో మాత్రం నిరుద్యోగులకు పెడుతున్న పరీక్షా పత్రాలను అమ్ముకుంటున్నారని అన్నారని.టీఎస్పీఎస్సీని రద్దుచేసినప్పుడే తెలంగాణలోని 30 లక్షల నిరుద్యోగులకు
న్యాయం జరుగుతుందన్నారు. 'అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన ఓటు హక్కు హక్కును బానిసలై నోటుకు అమ్ముకోకుండా మనకే అధికారం వచ్చేవిదంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అప్పుడే న్యాయం పేదవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రవర్ణాల నాయకులు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలను
విడదీస్తూ తమలో తామే కొట్టుకునే విదంగా తయారు చేస్తున్నారని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఆనాడు కాన్షీరామ్ స్థాపించిన బీఎస్పీని ప్రజలు ఎలా బతికించారో ఇప్పుడు తెలంగాణను దొరల పాలననుంచి విముక్తి
కల్పించాలని పిలుపునిచ్చారు. రూ. 3 లక్షల కోట్ల ఉన్న తెలంగాణ బడ్జెట్లో బీసీలకు రూ. 6 వేల కోట్లు కేటాయించారని, సగం జనాభా ఉన్న బీసీలకు ఇది ఏమాత్రం సరిపోతుందన్నారు. ఈ దొరల పాలనలో మనకు న్యాయం జరుగదని, ఓటుహక్కుతో బహుజనులకు రాజ్యాధికారం కట్టబెడితేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం దొరుకుతుందన్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీలు చదువుకుంటున్న విశ్వవిద్యాలయాల్లో, ట్రిపుల్ ఐటీల్లో లైబ్రరీ ఇతర కనీస వసతులు కూడా లేవని, బాసరలో వర్షంలో గొడుగులు పెట్టుకుని విద్యార్థులు
ఆందోళన చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. తెలంగాణ విద్యార్థులపై సీఎం కేసీఆర్కు ఎందుకింత వివక్షత అని ప్రశ్నించారు. 9 ఏళ్ల నుంచి ఒక్కవిశ్వవిద్యాలయాన్ని కూడా సందర్శించలేదన్నారు. తాను బీఎస్పీలో చేరినప్పటినుంచే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ భయంతో నీలిరంగు కండువాలు వేసుకుంటున్నారని అన్నారు. కోనరావుపేట ఉమ్మడి జిల్లాలోనే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలకు పురిటిగడ్డని, అగ్రవర్ణాలను గద్దె దించేందుకు, అణగారిన ప్రజలకు అధికారం ఇచ్చే
ఉద్యమాలకు సైతం ఇదే పునాదిగా మారాలన్నారు. అందరం కలుద్దాం. అందరం నిలుద్దాం. అందరం గెలుద్దామని పిలుపునిచ్చారు. మన సమస్యలపై ప్రశ్నించే రాజ్యం రావాలని కోరుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పుల దేవలక్ష్మి. ఉపసర్పంచ్ ఎరవెల్లి నాగరాజు, ఎంపీటీసీ మమత మహేష్, బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి అంకని బాను, బట్టు రాంచంద్రం,అక్కనపల్లి శిరీష, రాష్ట్ర నాయకులు ఎలగందుల వెంకన్న, పిట్టల భూమేష్,బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు స్వామి,బి ఎస్ పి కోనరావుపేట మండల అధ్యక్షులు దేవదాస్,జిల్లా కార్యదర్శులు బొడ్డు మహేందర్, లింగంపల్లి మధుకర్, గుగులోత్ చంద్రునాయక్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లల శ్రీనివాస్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్, కుల సంఘాల నాయకులు డప్పుల చంద్రం, దొబ్బల లింగయ్య,ఒద్యారం శేఖర్,రాము బి ఎస్ పి పార్టీ నాయకులు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు