రసవత్తరంగా వేములవాడ నియోజకవర్గ రాజకీయాలు

  • వేములవాడ పై మంత్రి కేటీఆర్ ఫోకస్
  • వేములవాడ రాజకీయ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఆరా..
  • వేములవాడ ఎమ్మెల్యే తీరుపైన మంత్రి కేటీఆర్ అసంతృప్తి..
  • కోరుట్ల ఎమ్మెల్యే తనయకుడు డాక్టర్ సంజయ్ , చలిమెడ ను కార్లో తీసుకెళ్లిన మంత్రి కేటీఆర్
  • కారులో ప్రణాళికబోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఫీఏలకు కారులో నో ఛాన్స్
  • కారు ప్రయాణంలోనే మంత్రి కేటీఆర్ చలిమెడ, డాక్టర్ సంజయ్ తో సుధీర్ఘ చర్చ
  • చలిమెడ లక్ష్మీనరసింహారావును కారులో తీసుకెళ్లి విడియో విజువల్స్ వైరల్..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ బీఆర్ఎస్ రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వం వివాదంతో పాటు స్థానిక క్యాడర్ వ్యతిరేఖిస్తున్న క్రమం, వస్తున్న ఆరోపణలు, రమేశ్ బాబు అధిష్టానానికి వ్యతిరేఖ ప్రకటనలు వెరసి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అసహానానికి కారణమైనట్లు సమాచారం. దీంతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అల్టర్నెట్ గా చలిమెడ వైద్య సంస్థల అధినేత చలిమెడ లక్ష్మీనరసింహారావును తీసుకువచ్చి వేములవాడ లో దింపినట్లు చర్చ కొనసాగుతుంది.ఏడాది కాలంగా నియోకవర్గంలో చలిమెడ వేములవాడ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకోని.. ఏకంగా వేములవాడ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యేకు పోటీగా ప్రారంభించాడు. ఈ కార్యాలయం ప్రారంబోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం లేపగా.. తెల్లవారే మంత్రి కేటీఆర్ చలిమెడను పలిచి సిరిసిల్ల నియోజకవర్గ సభలో స్టేజీపైకి పిలిచి మరి కూర్చబెట్టుకోవడం, అనంతరం హెలిక్యాప్టర్లో వైవి సుబ్బారెడ్డికి తోడుగా హైదరాబాద్ దగ్గరుండి పంపించడం తీవ్ర చర్చకు దారి తీసింది. మంగళవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో సైతం మరోసారి చలిమెడను వెంటేసుకోని హైదరాబాద్ వెళ్లడం చర్చనీయంశంగా మారింది. వేములవాడ లో బీఆర్ఎస్ లో రాజకీయ అనిశ్చితి, ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ క్యాడర్ వ్యతిరేఖత ప్రకటించి..కోనరావుపేట మండలంలో ఎమ్మెల్యే కార్యక్రమానికి జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణతో పాటు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు హజరుకాకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది. కోనరావుపేట ముఖ్య నేతలంతా చలిమెడకు మద్దతు ఇస్తున్న క్రమంలో.. మంగళవారం సిరిసిల్ల మినిస్టేడియం వద్ద వర్షం లో సైతం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్, వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశీస్తున్న చలిమెడ లక్ష్మీనరసింహారావు మంత్రి కేటీఆర్ తన కారులో ఎక్కించుకున్నారు. ఇద్దరు పీఏలను సైతం వెనక కారులో కూర్చోమన్నిచెప్పడంతో వారు వెనక్కి వెళ్లారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్కుమార్ ఈ కారులో ఎక్కడానికి ప్రయత్నించగా.. ముందు కారులో వెళ్లాల్సిందిగా సున్నితంగా సూచించడంతో వినోద్ కుమార్ సైతం మరో కారులో ఎక్కారు. కేవలం కారులో డ్రైవర్ మినహా మంత్రి కేటీఆర్, చలిమెడ లక్ష్మీనరసింహారావు, డాక్టర్ సంజయ్ మాత్రమే ఉన్నారు. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్లె సమయంలో సూమారు 3 గంటల పాటు వేములవాడ, కోరుట్ల రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా వేములవాడ రాజకీయ పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపైన మంత్రి కేటీఆర్ చలిమెడను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కారు జర్నీ మీటింగ్ లో ముగ్గురు నేతలు ఏం ముచ్చట పెట్టుకున్నారు అనే ప్రశ్న.. రాజకీయంగా చర్చనీయంశం అవుతుంది. కారులో చలిమెడను తీసుకొని వెళ్లె విడియోలు సోషల్ మీడియాలో.. వేములవడ నియోజకవర్గంలో వైరల్గా మారాయి. చలిమెడ లక్ష్మీనరసింహారావు టికెట్ విషయమే డాక్టర్ సంజయ్ మంత్రి కేటీఆర్ చర్చించడానికి వచ్చినట్లు చర్చ కొనసాగుతుంది. డాక్టర్ సంజయ్ మంత్రి కేటీఆర్ ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్ కావడం.. ఈ మధ్య చలిమెడకు రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యే రమేశ్ బాబు పౌరసత్వం కేసు విరద్దతంగా వస్తే చలిమెడను అల్టర్నెట్గా ఉపయోగించుకుంటారా...? లేక చెన్నమనేనిని వేములవాడ బీఆర్ఎస్ క్యాడర్ వ్యతిరేఖిస్తున్న క్రమంలో ఏమైన మార్పులు ఉంటాయా ఎవరికి అంతు చిక్కడం లేదు..ఇదిలా ఉండగా వేములవాడ లో మాత్రం చెలిమెడ నూతనంగా ప్రారంభించిన కార్యాలయంలో నూతన ఫర్నిచర్, క్యాబీన్లు తయారు చేయిస్తుండటం.. హాట్ టాఫీక్గా మారుతుంది.