జర్నలిస్టు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి...

జర్నలిస్టు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి...
  • సమస్యలపై ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డు..
  • రుద్రoగి మండల జర్నలిస్టుల వినతి..

ముద్ర,రుద్రoగి:జర్నలిస్టుల హెల్త్ స్కీములు అమలు చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలన్న డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల టియుడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టులు తమ స్వహస్తాలతో రాసిన పోస్ట్ కార్డులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , ప్రగతి భవన్ భవన్ కార్యాలయం చిరునామా పేరిట పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు మండల అధ్యక్షులు ధర్మేందర్ ,టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎలిగేటి సూర్యకిరణ్ లు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు ముఖ్య భూమిక పోషించారన్నారు.అలాంటి జర్నలిస్టులు నేడు స్వరాష్ట్రంలో ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో సత్వరమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టు హెల్త్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు.దళిత బంధు, బీసీ బంధు మాదిరిగానే జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టు బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేయాలన్నారు.అంతే కాకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు నాయకులు నంద్యాడపు అంజయ్య, బింగిశెట్టి వెంకటేష్, కురుమాచలం సత్యనారాయణ,ఎలిగేటి ప్రదీప్, కంటే స్వామి,పోగుల మోహన్,పడాల రమణ తోపాటు తదితరులు పాల్గొన్నారు.