సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు...

సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు...

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ప్రత్యేక విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది సేవలు అభినందనీయమని వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.మంగళవారం డిస్ట్రిక్ గార్డ్ కి జంగిల్ ప్యాచ్ డ్రెస్, జంగిల్ షూ మరియు హోం గార్డ్స్ కి యూనిఫామ్ క్లాత్, షూ లను ఎస్పీ అఖిల్ మహాజన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

పోలీస్ సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ క్యాంపు లు,యోగ క్లాస్ లు నిర్వహిస్తున్నామని,విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంగా ఉండుట కూడా ముఖ్యమని అందరూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని అన్నారు.అందుకోసం యోగ, వ్యాయామాలు రోజు వారి దినచర్యలో భాగం చేసుకోవాలని అన్నారు.వివిధ బందోబస్తులు నిర్వహించే సమయల్లో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ యాదగిరి,డిస్ట్రిక్ గార్డ్ సిబ్బంది,హోం గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.