ఈ నెల 4,5 తేదీల్లోనూ జిల్లాకు భారీ వర్ష సూచన

ఈ నెల 4,5 తేదీల్లోనూ జిల్లాకు భారీ వర్ష సూచన
  • జిల్లాలో వర్షాల వల్ల ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడాలి
  • జలాశయాలు, చెరువుల నీటి మట్టాలను రౌండ్ ద క్లాక్ ఇరిగేషన్ ఇంజనీర్ లు కని పెట్టుకోవాలన్నారు.
  • చెరువులు నిండిన చోట, ఓవర్ ఫ్లో అయిన చోట మానిటరింగ్ ఆఫీసర్ లను వెంటనే పెట్టాలి
  • నీటి ప్రవాహం ఉన్న లో లెవెల్ వంతెన , రోడ్లలో హెచ్చరిక ఫ్లెక్సీ లతో పాటు మానిటరింగ్ ఆఫీసర్ ఉండాలి
  • జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారుల తో  నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా లో భారీ వర్షాల నేపథ్యంలో  అధికారులు, క్షేత్ర సిబ్బంది ప్రజలు అలెర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రానున్న 2 రోజులు భారీ వర్ష సూచన  దృష్ట్యా   అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ లు , ఆర్డీవో లు , అన్నీ ప్రభుత్వ జిల్లా అధికారులతో  జిల్లా కలెక్టర్ రెవెన్యూ , పోలీస్ , పురపాలక , ఇరిగేషన్ , పంచాయితీ రాజ్ , వైద్యఆరోగ్య క్షేత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రానున్న మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సీరియస్ గా దృష్టి పెట్టీ సంబంధిత ప్రభుత్వ విభాగాలు  సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ... సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.నీరు ఓవర్ ఫ్లో అవుతున్న లో లెవెల్ వంతెన లు , రాకపోకలు సాగించే రోడ్ల పై  ప్రవహిస్తున్న నీటి వద్ద 24 గంటలు మానిటరింగ్ ఉంచాలన్నారు. రాకపోకలు జరగకుండా చూడాలన్నారు.స్ట్రీమ్ ల పరివాహక ప్రాంతం లోకి పశువులు, గొర్రెలు, మత్స్యకార్మికులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని చెప్పారు.
చెరువులు నిండిన చోట, ఓవర్ ఫ్లో అయిన చోట మానిటరింగ్ ఆఫీసర్ లను వెంటనే పెట్టాలన్నారు.నీటి ప్రవాహం ఉన్న లో లెవెల్ వంతెన , రోడ్లలో హెచ్చరిక ఫ్లెక్సీ లతో పాటు మానిటరింగ్ ఆఫీసర్ ఉండాలన్నారు.ఓర్రెలు , వాగుల్లో నీటి ప్రవాహం ఉన్నందున వాటిని దాటి రైతులు పంట క్షేత్రాలకు వెళ్లకుండా చూడాలన్నారు.లో లెవెల్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.పట్టణాలలోని పెద్ద డ్రైన్ ల వద్ద కు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మ్యాన్ హాల్ లు మూసి ఉంచాలన్నారు.ఎంపిడివో లు, తహశీల్దార్ లు తమ మండలాల పరిధిలో పరిస్థితులకు కనిపెట్టుకుని సమస్యల పై వెంటనే స్పందించాలని చెప్పారు.విద్యుత్ అంతరాయం జరగకుండా, ప్రమాదాలు, కరెంట్ షాక్ లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ విద్యుత్ అధికారులకి సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో శిథిలావస్థకు చేరుకునీ ప్రమాదకరం గా ఉన్న ఇండ్ల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచనలు

☞ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లవద్దు.

☞ చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు.

☞ కరెంట్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ముట్టుకోరాదు.

☞ వర్షం వల్ల వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉంది. పరిమిత వేగంతో వాహనాలు నడుపాలి. నీటి ప్రవాహాలు వెళ్లే లో లెవెల్  వంతెన లు, రోడ్ల పై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం చేయవద్దు.

☞ అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి.