జెడ్పి గర్ల్స్ హైస్కూల్ బాగుంది

జెడ్పి గర్ల్స్ హైస్కూల్ బాగుంది

సీఎం చీఫ్ అడ్వైజర్  సోమేశ్ కుమార్...   
ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:  సిరిసిల్ల పట్టణంలోని  జెడ్పి గర్ల్స్ హైస్కూల్   బాగుందని సీఎం చీఫ్ అడ్వైజర్  సోమేశ్ కుమార్ అన్నారు .సోమవారం సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్   ఆకస్మికంగాజెడ్పి గర్ల్స్ హైస్కూల్  సందర్శించారు. స్కూల్ పూర్వ స్థితి, మంత్రి కేటీఆర్  ప్రత్యేక చొరవతో మారిన రూపు రేఖలు, సౌకర్యాలు, పెరిగిన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్  సోమేశ్ కుమార్ కు తెలిపారు. పాఠశాల ప్లే గ్రౌండ్, డైనింగ్ హాల్, క్లాస్ రూం లను పరిశీలించారు. ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలా అంటూ స్టూడెంట్స్ ను  ప్రశ్నించారు. అన్ని సదుపాయాలు ఉన్నాయని స్టూడెంట్స్  సోమేశ్ కుమార్ కు  తెలిపారు. 

పాఠశాల పునరుద్దరణ కు ముందు 570 మంది స్టూడెంట్స్ ఉండగా ప్రస్తుతం 980 మంది స్టూడెంట్స్ చదువుతున్నారనీ టీచర్ లు తెలిపారు. అనంతరం.సిరిసిల్లలోని అపెరల్ పార్క్ ను సీఎం చీఫ్ అడ్వైజర్  సోమేశ్ కుమార్  సందర్శించారు.   పార్క్ లోనీ గోకుల్ దాస్ ఇండస్ట్రీ నీ పరిశీలించారు. ఇండస్ట్రీ నిర్వాహకులు, అందులో పని చేస్తున్న మహిళా కార్మికులతో మాట్లాడారు. ఇండస్ట్రీతో స్ధానికంగానే ఉపాధి లభిస్తుందనీ తద్వారా తమ కుటుంబాలకు అండగా ఉండగలుగుతున్నామని  మహిళలు సోమేశ్ కుమార్ కు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానంలో అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దిన అపెరల్ పార్క్ తో స్థానికంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందన్నారు.