గంజాయి నిందుతుల అరెస్ట్

గంజాయి నిందుతుల అరెస్ట్

ముద్ర, తంగళ్ళపల్లి,రాజన్న సిరిసిల్ల: జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందుతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో తంగళ్ళపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి తో కలిసి సిఐ ఉపేందర్ వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా సి.ఐ  మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామశివారులో గల రామాలయం గుడి వద్ద గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు  తంగళ్ళపల్లి ఎస్.ఐ  లక్ష్మారెడ్డి తన సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లి అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించగా  పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 01 కేజీ 470 గ్రాముల గంజాయి దొరకగా అట్టి వ్యక్తులను పట్టుకొని విచారించగా వారిని ఎండి అహ్మద్, గడదస్ శివ అలియాస్ శ్రీకాంత్,తాళ్లపల్లి ప్రణయ్, సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తులుగా  గుర్తించారు.

 నిందితులు తెలిపిన వివరాల ప్రకారం నాందేడ్ లోని గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి జిల్లా కి తీసుకువచ్చి అక్రమంగా అమ్ముతున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని సి.ఐ ఉపేందర్  తెలియజేశారు.ఇట్టి గంజాయి నిందితులను పట్టుకోవడం లో ప్రముఖ పాత్ర పోషించిన తంగళ్లపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది  నరేందర్,కార్తీక్,తిరుపతి, శ్రీనివాస్ లను సి.ఐ  అభినందించారు.. గంజాయి మరియు ఇలాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు.  ఈ సమావేశంలో ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది  నరేందర్,కార్తీక్,తిరుపతి ,శ్రీనివాస్ పాల్గొన్నారు.