రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్బంగా భక్తులు బారులు తీరారు.వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.సామాన్య భక్తులకు వేములవాడ దివ్యమైన క్షేత్రం. వేములవాడ అతి పెద్ద శైవ క్షేత్రమన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేమి రమేష్ బాబు ల సహకారంతో శైవ క్షేత్రం వేములవాడ లో అన్ని సౌకర్యాలు మెరుగు పరచడానికి కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రూ.50 కోట్ల నిధులతో భక్తుల సౌకర్యార్థం వేములవాడ లో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా మర్నిని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు.సిఎం కేసిఆర్ మార్గదర్శనం మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో గోదావరి జలాలలో ఆలయం ధర్మ గుండం నింపామని తెలిపారు. మహాశివరాత్రి సందర్బంగా వేమలువాడలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.