నాగరం చెరువు లోకి నీరు విడుదల చేయాలి..

నాగరం చెరువు లోకి నీరు విడుదల చేయాలి..
  • కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా..
  • రెండు కిలోమీటర్ల మేర ఆగిన వాహనాలు..

ముద్ర, రుద్రoగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఎల్లంపల్లి కాలువద్వారా నాగరపు చెరువు,అచ్చయ్యకుంట చెరువులోకి నీటిని విడుదల చేయాలని కొరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై రుద్రంగి కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే  రోగాల వల్ల పంట నష్టం వాటిల్లిందని, దానికి తోడు అకాల వర్షం వడగళ్ల వల్ల రైతులకు కన్నీళ్ళు మిగిల్చిందని,మిగిలిన పంట అయిన చేతికి వస్తుందనుకొంటే నీరు లేక ఉన్న కాస్త పొలాల కూడా ఎండి పోతున్నాయని అన్నారు..

ఎల్లంపల్లి కాలువద్వారా నాగరపు చెరువు,అచ్చయ్యకుంట చెరువులోకి నీటిని విడుదల చేసి పంటపొలాలు కాపాడాలని అన్నారు.. దాదాపు అరగంటకు పైగా ధర్నా నిర్వహించడంతో రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులతో మాట్లాడి ధర్నా విరవింప చేశారు..ఈ కార్యక్రమంలో డీసీసీ నాయకులు చెలకల తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు తర్రె మనోహర్,గడ్డ .శ్రీనివాసరెడ్డి,పల్లి గంగాధర్,తర్రె లింగం,గండి నారాయణా, మాడిశెట్టి అభిలాష్,పరంధాములు,ఎర్రం అరవింద్, సుద్దాల నరేష్, గంధం మనోజ్,సతీష్,మధు,రైతులు తదితరులు పాల్గొన్నారు.