న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు

న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు

ముద్ర,తంగళ్లపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లాతంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ మాట్లాడుతూ నేషనల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం జిల్లాలో న్యాయ సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి చైర్మన్ జడ్జి ఉంటారని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోవాలని న్యాయపరమైనటువంటి సహాయం చేయడానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ పనిచేస్తుందని సూచించారు. సమాజంలో చిన్న పిల్లల పైన లైంగికంగా వేధింపులకు గురైనప్పుడు పోక్సో చట్టం పైన కేసు విధించి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల గాని వాళ్ళ ఆలోచన విధానం పట్ల గాని అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా ఫోక్సొకి గురి అయినప్పుడు చట్టం ద్వారా ఒక తెల్ల కాగితం పైన కంప్లైంట్ ఇవ్వచ్చు,అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేము అని అనుకున్నప్పుడు సఖి కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చని అది కూడా కుదరదు అన్నప్పుడు పిల్లలకి కన్వీనెంట్ ఉన్న పరిస్థితిని ఏర్పాటు చేసి జడ్జి,పోలీసులు  వారు వాళ్ళ యూనిఫాంలో కాకుండా పిల్లలకు ఒక భయంకరమైన వాతావరణంలో కలిగించకుండా ప్రశాంతంగా ఉండే స్థితిలోనే ఉంచి వాళ్ళు చెప్పిన విధంగానే రికార్డ్ చేస్తూ ఈ యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుందన్నారు.అలాగే ఆమె ఎవరిపైన అయితే ఫిర్యాదు ఇస్తుందో  ధైర్యంగా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడానికి పూర్తి స్నేహపూరితమైన వాతావరణాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. మరియు వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి నడపరాదని వెహికల్ లైసెన్సులు పొంది ఉండాలన్నారు.భూమి కొనుగోలు అమ్మకాలు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెల్ల కాగితం ద్వారా కొనుక్కున్న ప్రాపర్టీ హక్కులు వర్తించవని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ,సర్పంచ్ గణప శివజ్యోతి,ఎంపిటిసి బుస్సా స్వప్న, ఉపసర్పంచ్ దర్మారెడ్డి నాగరాజు,ఎస్ఐ పి లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గనప మదన్,లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్,కుంట శ్రీనివాస్,కల్యాణి,విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు