జిల్లా కలెక్టరేట్ లో పండుగ వాతావరణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

జిల్లా కలెక్టరేట్ లో పండుగ వాతావరణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం
  • 25 రంగులలో, 25 డిజైన్లలో 525 రకాల చీరల తయారీ  
  • ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి : జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి 

సిరిసిల్ల టౌన్, ముద్ర:దేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా ఉంటూ ఆశీర్వదించాలని జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృతంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరలను ఏటా ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ఈ చీరల పంపిణీ తో సిరిసిల్ల లోని పవర్ లూమ్, నేత కార్మికుల కుటుంబాలకు నిరంతరం ఉపాధి లభించి ఆర్థికంగా బాగుపడ్డాయన్నారు. రానున్న బతుకమ్మ పండుగకు జిల్లాలోని మహిళా ప్రజా ప్రతినిధులం అందరం బతుకమ్మ చీరలు ధరించి వేడుకల్లో పాల్గొంటామని చెప్పారు.
టిఎస్పిటిడిసి చైర్మెన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ స్వరాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వ ప్రత్యేక చొరవతో బతుకమ్మ పండుగ ప్రపంచ పండుగగా ఆవిర్భవించిందన్నారు. ఒకప్పుడు హైదరాబాదులో ఆంధ్ర మహిళలు బతుకమ్మ ఆడాలంటే నామోషీగా ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఉత్సాహంగా, భక్తితో గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ వేడుకలను ఆడుకుంటున్నారని అన్నారు. గతంలో కంటే ఆకర్షణీయంగా బతుకమ్మ చీరలను తీర్చిదిద్దామని చెప్పారు. ఈ బతుకమ్మకు ప్రభుత్వం 25 రంగులలో, 25 డిజైన్లలో 525 రకాల చీరలను రూపొందించి పంపిణీ చేస్తుందన్నారు. రెండు రోజులలో అందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు.

మున్సిపల్ చైర్ పర్సన్  జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీ తో తెలంగాణ ఆడబిడ్డల మోముల్లో ఆనందాన్ని నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ అదే సమయంలో నేతన్న కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అన్నగా, మేనమామగా తెలంగాణ మహిళలకు బతుకమ్మ చీరలను ఏటా అందజేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ చీరల ఆర్డర్ లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడి ఆత్మగౌరవంతో నేతన్నలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, నాఫ్స్కాబ్  చైర్మన్ కొండూరి రవీందర్, సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డీఆర్డీవో నక్క శ్రీనివాస్, చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి సాగర్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగ రావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, సెస్ డైరెక్టర్ లు స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.