నల్ల మాస్కులతో మధ్యాహ్న భోజన వంట కార్మికుల మౌన దీక్ష

నల్ల మాస్కులతో మధ్యాహ్న భోజన వంట కార్మికుల మౌన దీక్ష


ముద్ర ప్రతినిధి భువనగిరి :మధ్యాహ్న భోజన కార్మికులకు రావలసిన జీతాలు, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని  డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద నల్ల మాస్కులతో  బుధవారం మౌన దీక్ష చేశారు.  ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి  ఇమ్రాన్  మాట్లాడుతూ వంట కార్మికులకు పూర్తి బిల్లులు, పెంచిన జీతం వచ్చేవరకు సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ లు వంట కార్మికులపై వేధింపులు ఆపి వారికి వచ్చే పెండింగ్ బిల్లులు ఇప్పించుటకు చొరవ చూపాలని ఆయన సూచించారు. పెంచిన జీతాలు, పెండింగ్ బిల్లులు వచ్చిన మరుసటి రోజే కార్మికులు స్కూల్ లలో వంటలు చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం ఉపాధ్యక్షులు జిన్న కృష్ణ, నాయకులు మణెమ్మ, లక్ష్మీ,  సంధ్యా, నిర్మల, శ్యామ్, వాణి, సప్న, అనురాధ, అండాలు కృష్ణవేణి, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.