మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు రాఖీలు కట్టిన కౌన్సిలర్  రేణుక 

మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు రాఖీలు కట్టిన కౌన్సిలర్  రేణుక 

భువనగిరి ఆగస్టు 31 (ముద్ర న్యూస్) :-అనునిత్యం పట్టణాన్ని శుభ్రపరుస్తూ ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రక్ష బంధన్ పండుగ సందర్భంగా  కౌన్సిలర్  పడిగెల రేణుక ప్రదీప్ రాఖీలు కట్టారు.  ఈసందర్భంగా మాట్లాడుతూ అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిరూపకంగా రక్షాబంధన్ పండుగను భారత దేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటారని ప్రాచీన సంస్కృతిని మరింత నేటి తరానికి తెలియజేస్తూ నేటి యువత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి మహిళలకు భారత దేశ యువత రక్షణగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె నరేందర్, దాసరి మధు, దండు రాము, ఇటుకల దేవేందర్, గుడ్డెంకి ప్రమోద్ కుమార్, గోపే బాబు, పారిశుద్ధ కార్మికులు రాజలింగం నరసింహ, లింగం, గాయపాక స్వామి, శంకరయ్య, పడిగెల మైసయ్య, యాదమ్మ, లక్ష్మమ్మ, నిర్మల, తలమ్మ ఎల్లమ్మ, రేణుక, లలిత పాల్గొన్నారు.