పేదరెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి 5వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

పేదరెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి 5వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
  • ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి వెనుకబడిన రెడ్డిలను ఆదుకోవాలి
  • కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం దృష్టికి తీసుకు వెళ్తాం
  • ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హామీ

ముద్ర ప్రతినిది, భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం కుటుంబాలలో విద్యా ఉపాధి లో అత్యంత వెనుకబడిన రెడ్డి సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వము 5 వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా  రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళన సభ డిమాండ్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షుడు రాముడి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో  రెడ్ల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ లు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డి , భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వారు మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ సాధనకై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తో కలిసి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ల సామాజిక వర్గానికి చెందిన వెనుకబడిన వారి గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. విరితో పాటు రాష్ట్రంలోని ప్రతి కులంలో వెనుకబడిన కుటుంబాలను రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

పలువురు రెడ్డి జేసి నాయకులు మాట్లాడుతూ 5వేల కోట్లతో చట్టబద్ధత కూడిన రెడ్డి కార్పొరేషన్ ప్రతి సంవత్సరానికి  నిధులు కేటాయించాలని విదేశీ విద్య అనేది పథకాన్ని ప్రతి పేదరెడ్డి విద్యార్థికి అందించాలని కోరారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న 36 జనరల్ గురుకులాలను వందకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు ఐదు లక్షల హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ పూర్తిస్థాయిలో రాష్ట్రంలో అన్ని విభాగాలు వర్తింపజేయాలి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సబ్సిడీలు పేద రెడ్డి కోసం  ఉద్యోగ వయోపరిమితి మరియు కట్ ఆఫ్ మార్కులను సవరించాలి, రైతు బీమా పథకాన్ని వయస్సుతో నిమిత్తం లేకుండా రైతులందరికీ వర్తింపజేయాలని కోరారు.

ఉపాధి హామీ పథకానికి వ్యవసాయం అనుసంధానం చేయాలనికోరారు. ఎవరెస్టు శిఖరం అధిరోహిత యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పడమటి అన్విత రెడ్డి ని రెడ్డి ని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అన్విత రెడ్డి ప్రపంచంలో ఎత్తైన శిఖరాలను ఎనిమిది శిఖరాలను అధిరోహించారని మిగతా రెండు శిఖరాల అధిరోహించడానికి పూర్తిఆర్దిక సహాయము అందజేస్తామని హామీ ఇచ్చారు.

 డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన   అన్విత రెడ్డి ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ముద్దుబిడ్డ భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన  అన్వితా రెడ్డికి భవిష్యత్తులో అన్ని రకాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలు 1,50,000 చెక్కులను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ సమన్వయకర్త పైళ్ల హరినాథ్ రెడ్డి, బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, గోపు జయపాల్ రెడ్డి, నల్ల సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్ముల కృష్ణారెడ్డి, మేక సోమిరెడ్డి, ఎలిమినేటి సుధాకర్ రెడ్డి, రామిరెడ్డి నర్సిరెడ్డి, వాకిటి వెంకటరెడ్డి,  సోమ మైపాల్ రెడ్డి, పైల నారాయణరెడ్డి, భీమిడి వెంకటరెడ్డి, నల్ల వెంకటరెడ్డి, మహిళా నాయకురాలు వసంత రెడ్డి,ఎలా సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.