గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 

గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి భువనగిరి :గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి మండలంలోని  అనంతారం, తాజ్ పూర్, హన్మాపురం, మన్నేవారి పంప్, వడపర్తి, బస్వాపూర్, ముత్తిరెడ్డి గూడెం, వడాయ్ గూడెం, కునూర్, చీమల కొండూరు, ముస్తాల్ పల్లి ,వీర వెళ్లి, బండ సోమారం, చందుపట్ల, తుక్కాపురం, గౌస్ నగర్, నమాత్ పల్లి, నందనం, అనాజిపూర్  గ్రామాలలో పర్యటించి గ్రామాల్లోని సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజి పనులకు,  భవనాలకు,  ఓపెన్ జిమ్ ల, కుల సంఘాల కమ్యూనిటీ భవనాల  శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు  చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతి గడపకు ఏదో ఒక సంక్షేమ అందుతున్నాయని చెప్పారు. మహిళలకు బతుకమ్మ చీరలు, గ్రామాల్లోని యువతకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాసాల  నిర్మల, సుబ్బురు బీరు మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మండల ప్రధాన కార్యదర్శి నీల ప్రకాష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.