సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు రూపొందించారు: రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ 

సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు రూపొందించారు: రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ 

భువనగిరి జూన్ 23 (ముద్ర న్యూస్) : గత ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు రూపొందించారని రాష్ట్ర హోం శాఖ మంత్రి  మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బొమ్మాయిపల్లి  చౌరస్తా వద్ద  నూతన ఈద్గా నిర్మాణానికి  ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత  ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. తెలంగాణ లో కబ్జాలకు గురవుతున్న భూములను పరిరక్షించాలని ప్రత్యేక జీవో తీసుకువచ్చి వక్ఫ్ భూములను రక్షించిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని తెలియజేశారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ సర్వ మతాల అభివృద్ధి శాంతియుత వాతావరణం లో మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు రూపొందించారని చెప్పారు.

 భువనగిరి పట్టణంలో కూడా కబ్జాకు గురైన భూమిని ముఖ్యమంత్రి,హోమ్ శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్ల గానే ఈ భూమిపై రెవిన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ భూమిని రక్షించి మైనార్టీలకు కానుకగా ఇవ్వడం జరిగిందని దీనికి మన ముఖ్యమంత్రి కి, హోమ్ మంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ అమరేందర్ గౌడ్,  రైతు సమన్వయ సమితి చైర్మన్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు,  పసివుల్లా ఖాన్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ అజీమ్ పాల్గొన్నారు.