యువజన కాంగ్రెస్ నాయకుని గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేసిన కిరణ్ కుమార్ రెడ్డి.....

యువజన కాంగ్రెస్ నాయకుని గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేసిన కిరణ్ కుమార్ రెడ్డి.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కాండ్రాజ్ శివశంకర్ గృహ నిర్మాణం కోసం పిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై గత 20 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న శివశంకర్ సేవలను గుర్తించి ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో శివశంకర్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా కార్యదర్శి ఆరే ప్రశాంత్ గౌడ్. పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.