చంద్రయాన్ - 3 విజయవంతం పై అవగాహన ర్యాలీ

చంద్రయాన్ - 3 విజయవంతం పై అవగాహన ర్యాలీ

ముద్ర,తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని మండేపల్లి గ్రామంలో సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని విద్యార్థులచే చంద్రయాన్ 3 విజయ వంతం, దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.గ్రామ కూడలిలో విధివీధిన అవగాహన ర్యాలీ తీశారు. దీనిలో భాగంగా సర్పంచ్ గణప శివ జ్యోతి మరియు ఎంపీటీసీ బుస్సా స్వప్న లింగం ఎఎంసి చైర్మన్ బండి దేవదాస్ ఉప సర్పంచ్ నాగరాజు పాల్గొని విద్యార్థి విద్యార్థులను అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ కొక్కుల శ్రీనివాస్ పాఠశాల బృందం విద్యార్థులు పాల్గొన్నారు.