పెద్దూర్ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్, అధికారులు:

పెద్దూర్ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్, అధికారులు:

ముద్ర సిరిసిల్ల టౌన్;  సిరిసిల్ల పట్టణం పెద్దూర్ లోని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కల్పన పూర్తిస్థాయిలో కానందున ఈరోజు నిర్వహించాల్సిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు డ్రా పద్ధతిని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని దీన్ని ప్రజలందరూ గమనించాలని, పూర్తిస్థాయిలో నివాసయోగ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో మౌలిక వసతులు కల్పించి మళ్లీ డ్రా నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటించి లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

అందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు అధికారులతో కలిసి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించడం జరిగిందని, రాబోయే 10 రోజులలోపే అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించైనా పెండింగ్ పనులన్నీ పూర్తిస్థాయిలో చేయాలని, అలాగే నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడ కూడ నిర్లక్ష్యం చేయరాదని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లనుఆదేశించారు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ ఇన్ ఛార్జ్ సామాజిక సంక్షేమ శాఖ ఈఈ విరూపాక్షతో ఫోన్లో మాట్లాడి పనుల్లో జాప్యానికి గల కారణాలను తెలుసుకొని త్వరగా పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. వీరి వెంట వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ, అన్నారం శ్రీనివాస్, అడ్డగడ్ల మాధవి మురళి, దార్ల కీర్తన సందీప్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , విద్యుత్ శాఖ , మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సంబంధిత కాంట్రాక్టర్లు ఉన్నారు.