బాలాలయ నిర్మాణానికి  భూమి పూజ

బాలాలయ నిర్మాణానికి  భూమి పూజ

ముద్ర,ఎల్లారెడ్డిపేట:  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శివాలయం లో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కి  బాలాలయ నిర్మాణానికి బుధవారం ఉదయం 7గంటల ముహూర్తమున  కరీంనగర్ వేద భవనం గురువు శ్రీ కలకుంట్ల వరప్రసాదా చార్యుల చేతుల మీదుగా  భూమి పూజ చేశారు.దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా  శాంతి హవనం,  వాస్తు హవనం  ,విశ్వక్షేన  విజ్ఞాపన  పూజాది కార్యక్రమాలను   శ్రీ కలకుంట్ల వరప్రసాద చార్యుల ఆధ్వర్యంలో ఆలయ పూజారి బిట్కూరి నవీన్ చారి,  నిర్వహించారు.

శివాలయంలో శ్రీ వేణుగోపాలస్వామి బాలాలయ నిర్మాణం కోసం   భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి,  గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ ,  ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ ,ఉపాధ్యక్షులు ముత్యాల  ప్రభాకర్ రెడ్డి , సందుపట్ల లక్ష్మారెడ్డి, ప్రతినిధులు  గుండాడి వెంకట్రెడ్డి, మేగి నర్సయ్య, పారిపెల్లి రాంరెడ్డి, ముప్పవరం  రాధాక్రిష్న రావు , బండారి బాల్ రెడ్డి , ఎలగందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు,