సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

గిరిజన సంక్షేమం కోసం సిఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు
రాజన్నసిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: గిరిజన సంక్షేమం కోసం సిఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నరని, గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నరని రాజన్నసిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి పేర్కొన్నారు.సిరిసిల్ల పట్టణం పెద్దూర్  శివారు లో గల బంజార భవన్ స్థలం లో ఏర్పాటు చేసిన సద్గురు సంత్ సేవాలల్ మహారాజ్ 284 వ జయంతి ఉత్సవాలలో   జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నీ అధికారికంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనుల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారు అని అన్నారు. గిరిజన తండాలలో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో మౌలిక సదుపాయాలను  ప్రభుత్వం  కల్పిస్తుందన్నారు. గిరిజన తండాలను, ఆవాసాలను గ్రామ పంచాయితీలుగా మార్చి గిరిజనులను స్వయం పాలన చేసుకునేలా వారికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఎస్టీ ల అభ్యున్నతి కొరకు తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా అన్ని ఆధునిక సౌకర్యాలు, ఐఏఎస్ స్టడీ సర్కిల్, స్పోర్ట్స్ కాలేజీల ద్వారా ఎస్టీ పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన పిల్లలకు 'గిరి పోషణ' కింద పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను 'గిరి' బ్రాండ్ తో మార్కెట్లోకి తెచ్చి లాభసాటి ధరలను అందజేస్తోందన్నారు. మంత్రి కేటీఆర్  జిల్లాలో ఉన్న గిరిజనుల అభివృద్ధి కి ఎంతో పాటు పడుతున్నారని అన్నారు. కేటీఆర్ గారి ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలో గిరిజనులకు ఒక ఎకరా స్థలంలో  రూ.1.10కోట్ల వ్యయంతో  నిధులతో బంజార భవన్ నిర్మాణం కాబోతుందన్నారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య , అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్  , మున్సిపల్  చైర్మన్ జింధం కళా చక్రపాణి  , వీర్నపల్లి జడ్పీటిసీ గుగులోత్ కళావతి సురేష్ నాయక్  , జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గుగులోత్ సురేష్ నాయక్  , జిల్ల బంజర సంగం అద్యక్షులు అజమేరా రాజు నాయక్ , కౌన్సిలర్లు రెడ్డి నాయక్  , లింగంపల్లి సత్యనారాయణ  , నాయకులు శర్మన్ నాయక్ , తిరుపతి నాయక్ ,హజ్జు నాయక్ గొపి నాయక్ , గజన్ నాయక్,అనిల్ నాయక్ , మోహన్ నాయక్  తదితరులు పాల్గొన్నారు.