సిద్దిపేట ప్రజలే నా బలం.. నా శక్తి...

సిద్దిపేట ప్రజలే నా బలం.. నా శక్తి...
  • నాడు ఉద్యమానికి నాంది.. నేడు అభివృద్ధి కి దిక్సూచి..
  • దేశములోనే గొప్ప డెస్టినేషన్ గా రంగనాయక సాగర్..
  • 100 కోట్లతో అద్భుతమైన టూరిజం స్పాట్ గా రంగనాయక సాగర్..
  • పంద్రాగస్టు కు సిద్దిపేట కు రైలు ..
  • నాడు గుక్కెడు నీళ్లు లేని సిద్దిపేట నేడు ఇతర ప్రాంతాలకు ఇచ్చే సాగు త్రాగు నీరు ఇచ్చే ప్రాంతంగా సిద్దిపేట ...
  • కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. 
  • సిద్దిపేట పట్టణము లో నీలకంఠ సమాజం ధ్యాన మందిరం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు గారు...

సిద్దిపేట నాడు ఉద్యమానికి నేడు అభివృద్ధి మార్గదర్శనం అని.ప్రజలే నా బలం నా శక్తి అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట పట్టణంలో నీలకంఠెశ్వర ఆలయం ప్రాంగణంలో  సమాజం వారు నిర్మించిన ధ్యాన మందిరాన్ని మంత్రి  హరీష్ రావు గారు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... సిద్దిపేట నాటి ఉద్యమం నుండి నేటి అభివృద్ధి వరకు సిద్దిపేట మార్గదర్శనం ప్రేరణ గా రాష్ట్రానికె ఆదర్శంగా నిలుస్తుంది అంటే సిద్దిపేట ప్రజల భాగస్వామ్యం ..సహకారం అని.. సిద్దిపేట ప్రజల బలమే ఈ అభివృద్ధి కి నిదర్శనమని మంత్రి చెప్పారు.. 15 ఏళ్ల శ్రమ ఫలితం ఈ ధ్యానమందిరం భవనం. నీలకంఠ సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు.ప్రభుత్వ సహకారంతో పాటు సమాజ సభ్యుల కృషితో ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు.

నీలకంఠ సమాజానికి గుర్తింపు తెచ్చింది సిద్దిపేట రాష్ట్రంలో నే ప్రేరణ గా నిలిచిందన్నారు.. నీలకంఠ సమాజానికి అవసరమైన సేవలు అందించడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని చెప్పారు..  ప్రతిరోజు యోగా, ప్రాణాయామం, వాకింగ్ చేస్తే 90% రోగాలకు దూరంగా ఉండొచ్చని ప్రతి ఒక్కరు యోగ అలవాటు చేస్కోవాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గం విద్య, వైద్య రంగాలలో సంపూర్ణంగా అభివృద్ధి సాధించిందని చెప్పారు.. ఎలాంటి రోగమైన ఇక్కడే వైద్యం, ఎలాంటి చదువుకైనా ఇక్కడే విద్యా అందేలా అభివృద్ధి చేసుకున్నామన్నారు.. సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్, నిర్మాణం రోడ్ల విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఇంటింటికి త్రాగునీరు, అందర్నీ ఆకర్షిస్తున్న కోమటి చెరువు అభివృద్ధి.

కోమటి చెరువుకు ముడంతల అద్భుతమైన పర్యటక కేంద్రంగా రంగనాయక చెరువును 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నాము. దేశములో నే అద్భుతమైన డెస్టినేషన్ ప్రాంతంగ రంగనాయక సాగర్ అభివృద్ధి చేసుకోబోతున్నాము..  ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా సిద్దిపేట అభివృద్ధికి కృషి చేస్తున్నాను.సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది మాటలు అంటున్నారని నా బలం..నా శక్తి సిద్దిపేట ప్రజలే అని ఈ సందర్భంగా అన్నారు. సహాయం కోసం వచ్చిన వారికి కాదు అనకుండా సేవ చేసే అదృష్టం ఇవ్వాలని ప్రతిరోజు దేవున్ని ప్రార్థిస్తానని మంత్రి చెప్పారు.. సిద్దిపేట చుట్టూ అన్ని వైపులా ఫోర్ లైన్ల రహదారి నిర్మాణం జరుగుతుందని సిద్దిపేటలో భవిష్యత్తులో రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. సిద్దిపేటకు రోడ్లు, రైలు, నీళ్లు అన్ని అయిపోయినాయి. ఇక ఒక విమాన ప్రయాణం సౌకర్యం మాత్రమే లేదు. భవిష్యత్తులో కావాలని ఆశిద్దామన్నారు.. ముఖాన్ని మొగలుకు పెట్టి చూసే బాధ కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు తప్పింది. నీటి చుక్క లేని రోజుల నుండి బావులలో బిందెలతో నీళ్లు ముంచుకునే రోజులు తెలంగాణ ఏర్పాటు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చాయని చెప్పారు... నీలకంఠ సమాజానికి, సిద్దిపేటకు అవసరమైన అన్ని వసతుల సంపూర్ణమైన ఏర్పాటు చేసుకున్నందుకు కృషి చేస్తా. కంటి వెలుగు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఉచితంగా కంటి వైద్య పరీక్షలు పొందండిని సూచించారు..