సిద్దిపేటలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేటలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన మంత్రి హరీష్ రావు

ఇఫ్తార్ విందు లో పాల్గొన్న కర్ణాటక కు చెందిన  కేంద్ర మాజీ మంత్రి  సీఎం ఇబ్రహీం

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: రంజాన్ పండుగను పురస్కరించుకొని సిద్దిపేట నియోజకవర్గ ముస్లింలకు ఆదివారం  రాత్రి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ఇఫ్తార్ విందు ఇచ్చారు
స్థానిక ఇక్బాల్  మీనార్ వద్ద ఉన్న మదీనా ఫంక్షన్ హాల్ లో ఈ విందు జరిగింది. విందుకు కర్ణాటకకు చెందిన జెడిఎస్ నేత కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, తంజీమ్ నేతలు జావేద్, ఎజాస్, అబ్దుల్ ఖాన్, నయ్యరు పటేల్, హక్తర్ పటేల్, వహీద్ ఖాన్, మోహిన్ మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు పలువురు కౌన్సిలర్లు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి రాత్రిపూట స్వయంగా భోజనాలు వడ్డించారు ఖర్జూరం పండ్లు తినిపించారు సుమారు 500 మందికి నేరుగా తన చేతులతో వడ్డించారు.

 ఈ సందర్భంగా కర్ణాటక జెడిఎస్ నేత కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం మాట్లాడుతూ  హరీష్ రావు ఒక ఆత్మ లాంటి వాడన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం అక్కడున్న హరీష్ రావు మాత్రం ఆత్మలాగా ప్రతి చోటా  తిరుగుతాడని చెప్పారు
 కెసిఆర్ పాలన దేశానికి ఆదర్శం అని చెప్పారు
 రాబోయే ఎన్నికల్లో హరీష్ రావుకు కనివిని రీతితో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిద్దిపేట నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు
కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడుతుందని అందుకు సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు 
ఢిల్లీలో తెలుగువాడు జెండా ఎగర వేసే సమయం ఆసన్నమైంది అది కేసిఆర్ తోనే సాధ్యమన్నారు.
  ఎన్నికల సమయంలో కొత్త బిచ్చగాళ్ళలాగా ఆ ఈ పార్టీలు వస్తారు వారి నమ్మొద్దని సీఎం ఇబ్రహీం కోరారు
హరీష్ రావు లాంటి గొప్ప నాయకుడు ఈ ప్రాంతంలో దొరకడం మీరందరూ అదృష్టవంతులు అన్నారు.

 ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

కర్ణాటక రాష్ట్రంలో అందరం వచ్చి ప్రచారం చేస్తాం.

- కర్ణాటక లో మంచి ప్రభుత్వం రావాలి.

- సీఎం కేసీఆర్ పెట్టిన పార్టీకి మహారాష్ట్రలో మంచి స్పందన ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కలిసి పనిచేద్దాం.

- దేశానికి తెలంగాణ మోడల్.

- కర్నాటక రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే తెలంగాణ తరహాలో పథకాలు.

- మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక లో మన తెలంగాణ రాష్ట్ర పథకాలు కావాలని కోరుతున్నారు.

- సమస్యలు పరిష్కారానికి కృషి చేద్దాం
- అన్నింటా సిద్దిపేట ఒక మోడల్ గా నిలిచింది.

- దేశవ్యాప్తంగా ప్రతినిధులు వచ్చి చూస్తున్నారు.