కెసిఆర్ గజ్వేల్ నుండే మళ్లీ పోటీ చేయాలి

కెసిఆర్ గజ్వేల్ నుండే మళ్లీ పోటీ చేయాలి

సిద్దిపేట,  ముద్ర ప్రతినిధి : గజ్వేల్ అభివృద్ధిని 50 ఏళ్ల ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్  ఎన్.సి రాజమౌళి గుప్త విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.సిఎం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నందున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చెందిందని, అభివృద్ధిలో ఆదర్శంగా ఉందని, సమీకృత కూరగాయల మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్, సమీకృత ప్రభుత్వ కార్యాలయం, మినీ స్టేడియం, పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, ఆధునికమైన వసతులతో ఆర్టీసీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, మహతి ఆడిటోరియం, ప్రభుత్వ ఆసుపత్రుల లాంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు . గజ్వేల్ ప్రజల రైలు కలలు నిజం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజవర్గ ప్రజలు రుణపడి ఉంటారని ఆయన తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి గజ్వేల్ నుండి ప్రాతినిధ్య వహించాలని నియోజకవర్గ ప్రజల కోరుతున్నారని రాజమౌళి గుప్త తెలిపారు.