మత్స్య కారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: జిల్లా మత్స్య శాఖ అధికారి

మత్స్య కారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: జిల్లా మత్స్య శాఖ అధికారి

నంగునూరు, ముద్ర: మత్స్య కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం అన్నారు.సోమవారం రాష్ట్ర ఆయిల్ ఫామ్ సోసైటి రైతు ఉపాధ్యాక్షుడు ఎడ్ల సోమిరెడ్డితో కలసి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్లమల్యాల పెద్ద చెరువు వద్ద మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన మత్స్య కార్మికులకు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించి మాట్లాడారు.

మండలంలో నీటి విస్తీర్ణం పెరగడంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్య కార్మికునికి సభ్యత్వం కల్పించాలని ఉద్దేశంతో వృత్తి నైపుణ్యంపై పరిక్షలు నిర్వహించమని తెలిపారు.ప్రతి ఒక్కరు వృత్తిపై అవగాహన పెంచుకుంటే జీవనోపాధికి దోహదపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కర్ణకంటి రేణుక వేణుగోపాల్, గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్,మత్స్య శాఖ సిబ్బంది,గ్రామ శాఖ మత్స్యశాఖ అధ్యక్షుడు ద్యాగల శ్రీనివాస్,అశోక్, ప్రవీణ్, కిష్టయ్య,మాజీ ప్రజాప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.