ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి నిరుద్యోగ యువతకు పాల సాయిరాం పిలుపు

ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి  నిరుద్యోగ యువతకు పాల సాయిరాం పిలుపు

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి జిల్లా స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఇస్తున్న గ్రూప్ 2 ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం పిలుపునిచ్చారు. రెండో విడత నిరుద్యోగ యువతకు గ్రూప్ 2 వారికి నిర్వహించిన 75 రోజుల  ఉచిత శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో సాయిరాం మాట్లాడారు.


మంత్రి హరీష్ రావు ప్రత్యేక కృషి వల్ల నిరుద్యోగ యువతకు సిద్దిపేటలో ఉచిత కోచింగ్ సెంటర్లను స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాటు చేశామన్నారు. చదువుకోవసరమైన మెటీరియల్ తో పాటు రోజు స్నాక్స్ అందజేయడం జరిగిందని తెలిపారు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ మాట్లాడుతూ కోచింగ్కు హాజరైన విద్యార్థులకు నెలకు  వెయ్యి రూపాయల చొప్పున గౌరవభృతి అందజేసినట్లు తెలిపారు.