మిల్లర్లు వ్యాపార దృష్టిని మానండి ... ఎమ్మెల్యే రాజయ్య

మిల్లర్లు వ్యాపార దృష్టిని మానండి ... ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: మిల్లర్లు వ్యాపార దృష్టితో కాకుండా మానవత్వంతో రైతులు తెచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనంగా గన్ పూర్ మార్కెట్లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో వరి ధాన్యం, మొక్కజొన్నలు ఇతర పంటలు తడిసి రైతుకు నష్టాన్ని మిగిల్చాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను మిల్లర్లు కొనుగోలు చేయాలన్నారు.

తడిసిన, మొలకెత్తిన, తేమ అధికంగా ఉన్న పేరుతో తరుగు రెండు కిలోలకు మించకుండా చూడాలన్నారు. ఆరుగాలం కష్టపడిన రైతుకు రెక్కల కష్టం కూడా మిగలడం లేదని అందుకే మిల్లర్లు వ్యాపార దృష్టితో కాకుండా మానవతా కోణంలో వ్యాపారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, డిఎంఓ నాగేశ్వరరావు, మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, మార్కెట్ డైరెక్టర్లు శ్యాంసుందర్ రెడ్డి, రాజ్ కుమార్, రాజన్ బాబు జేఎంఎస్ విజయ్ కుమార్ ఒడిసిఎంఎస్ సంతోష్ వ్యాపారస్తులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.