జిల్లా కార్యవర్గ సభ్యుడిగా “బండారి”

జిల్లా కార్యవర్గ సభ్యుడిగా “బండారి”

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం జనగామ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా చిల్పూర్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన బండారు రాజ్ కుమార్ ను నియమిస్తూ గురువారం జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ రాష్ట్ర అధ్యక్షులు మోడరాజా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ చేనేత కార్మికులు పద్మశాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. చేనేత కార్మికులకు బీసీ బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు.