ఘనంగా దుర్గమ్మ పండుగ

ఘనంగా దుర్గమ్మ పండుగ

లింగాలఘనపురం, ముద్ర : మండలం జీడికల్ గ్రామంలో దుర్గమ్మ పండుగను శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు బీఆర్‌‌ఎస్‌ రాష్ట్ర నేత, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి వేడుకలకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నియోజకవర్గ వర్క్స్ కమిటీ చైర్మన్ బొల్లంపల్లి నాగేందర్, మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు దూసరి గణపతి,  తదితరులు పాల్గొన్నారు.