మానసిక ఉల్లాసానికి క్రీడలు

మానసిక ఉల్లాసానికి క్రీడలు

... ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: క్రీడలు మానసిక ఉల్లాసం, దేహ దారుఢ్యం పెంచుతాయని ఎమ్మెల్యే డా.రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సీఎం కప్ 2023 క్రీడలను సోమవారం ఆయన ప్రారంభించారు. స్థానిక ఎంపీపీ, మండల స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ కందుల రేఖగట్టయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ పేరిట పోటీలు నిర్వహిస్తుంది అన్నారు.  

సీఎం కప్-2023 లో అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఏసిపి రవిచందర్, ఆర్డీవో కృష్ణవేణి, తాసిల్దార్ పూల్ సింగ్ చౌహాన్, సిఐ రాఘవేందర్, ఎంపీడీవో, ఎంపీ ఓ మండల పార్టీ అధ్యక్షు లు మాచర్ల గణేష్, సర్పంచ్ సురేష్ ఎంపీటీసీలు నర్సింలు, దయాకర్, రాజు మార్కెట్ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, ఎంఈఓ ఆజం మొహీనుద్దీన్ పిటిలు అనంతపురం ప్రవీణ్, గిరెడ్డి ప్రమోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.