స్టేషన్ ఘన్ పూర్ రిజర్వాయర్ల హబ్: ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్ రిజర్వాయర్ల హబ్: ఎమ్మెల్యే రాజయ్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం రిజర్వాయర్ల హబ్ అని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఊరూర చెరువుల పండుగ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ ఊరేగింపుతో చెరువు కట్ట చేరుకుని కట్టమైసమ్మ కు ప్రత్యేక పూజలు చేశారు.

చెరువు కట్టలను మరమ్మతులు చేయడంతో 262 టీఎంసీల నీటిని నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకొని భూగర్భ జలాలను పెంచుకోవడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ధర్మసాగర్, ఘన్పూర్, గండీరామారం, అశ్వరావుపల్లి, చీటకోడూరు, ఉప్పుగల్లు, నవాబుపేట తో రిజర్వాయర్ల హబ్ గా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కృష్ణవేణి, ఏసీపీ రఘు చందర్, తాసిల్దార్ పూల్ సింగ్ చౌహన్, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, జడ్పిటిసి మారపాక రవి, ఈవో సత్యనారాయణ ముదిరాజ్ మహాసభ నాయకులు నీల ఐలయ్య, మునగల వెంకన్న, లింగం తదితరులు ఉన్నారు.